రెండు జాతీయ పురస్కారాలు 'పెళ్లిచూపులు'కు
- April 07, 2017
చిన్న చిత్రంగా విడుదలై 2016లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న ‘పెళ్లిచూపులు’ను రెండు జాతీయ అవార్డులు వరించాయి. 64వ జాతీయ చలన చిత్ర అవార్డులను జ్యూరీ సభ్యులు శుక్రవారం ప్రకటించారు. ఇందులో రెండు కేటగిరీల్లో ‘పెళ్లిచూపులు’ చిత్రం అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ సంభాషణలు విభాగంలో అవార్డులను సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఇందులో సంభాషణలకుగానూ తరుణ్ భాస్కర్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో నృత్యాలను సమకూర్చిన రాజు సుందరంను ఉత్తమ నృత్య దర్శకుడిగా జ్యూరీ ఎంపిక చేసింది.
ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శతమానం భవతి’ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డుకు ఎంపికయ్యింది. సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించారు.
ఈసారి ఉత్తమ జాతీయ నటుడి అవార్డుకు బాలీవుడ్ ‘కిలాడీ’ అక్షయ్‌కుమార్ ఎంపికయ్యారు. టిను సురేశ్ దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుస్తమ్’ చిత్రంలో నటనకు గానూ అక్షయ్‌కు ఈ అవార్డు దక్కింది. ఉత్తమ నటిగా సురభిలక్ష్మి(మిన్నామినుంగు-మలయాళం)ని జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు.
వివిధ విభాగాల్లో పురస్కారాలు ఇలా..
* ఉత్తమ హిందీ చిత్రం - నీర్జా
* ఉత్తమ నటుడు - అక్షయ్‌కుమార్(రుస్తమ్)
* ఉత్తమ నటి - సురభి లక్ష్మి(మిన్నామినుంగు)
* ఉత్తమ దర్శకుడు - రాజేశ్(వెంటిలేటర్)
* ఉత్తమ సహాయ నటి - జైరా వాసిమ్(దంగల్)
* ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రం - శివాయ్
* ఉత్తమ సంభాషణలు - తరుణ్ భాస్కర్(పెళ్లిచూపులు)
* ఉత్తమ సంగీత దర్శకుడు - బాపు పద్మనాభ(అల్లమ-కన్నడ)
* ఉత్తమ కన్నడ చిత్రం - రిజర్వేషన్
* ఉత్తమ సామాజిక చిత్రం - పింక్
* ఉత్తమ తమిళ చిత్రం - జోకర్
* ఉత్తమ ప్రజాదరణ చిత్రం - శతమానంభవతి
* సినిమాలకు స్నేహపూర్వక రాష్ట్రం - ఉత్తర్‌ప్రదేశ్
* ప్రత్యేక జ్యూరీ అవార్డు - మోహన్‌లాల్(జనతాగ్యారేజ్, పులిమురుగన్)
* ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ - పీటర్హెయిన్స్(పులిమురుగన్)
* ఉత్తమ మలయాళీ చిత్రం - మహెశింతె ప్రతీకారం
* ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - 24
* ఉత్తమ పరిచయ దర్శకుడు - దీప్ చౌదరి(అలిఫా)
* ఉత్తమ బాలల చిత్రం - ధనక్(హిందీ)
* ఉత్తమ బాల నటుడు: అదిష్ ప్రవీణ్(కుంజు దైవమ్), సాజ్(నూర్ ఇస్లాం), మనోహర్ (రైల్వే చిల్డ్రన్)
* ఉత్తమ నేపథ్య గాయకుడు - సుందరా అయ్యర్(జోకర్)
* ఉత్తమ నేపథ్య గాయని - తుమి జాకీ
* ఉత్తమ స్క్రీన్‌ప్లే(ఒరిజినల్) - శ్యామ్ పుష్కరన్(మహెషంతి ప్రతీకారం)
* ఉత్తమ స్క్రీన్‌ప్లే(అడాప్టెడ్) - సంజ్ కిషన్ జీ పటేల్(దశక్రియ)
* ఉత్తమ ఎడిటింగ్ - రామేశ్వర్ (వెంటిలేటర్)
తాజా వార్తలు
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు









