బహ్రెయిన్ పౌరునిపై దాడి కేసులో చిక్కుకొన్న ముగ్గురు ఆసియాదేశాల నిందితులు
- April 07, 2017
' అనువు కానీ చోట అధికులమని అనరాదని ' నీతివాక్యం వారు చిన్నప్పుడు బహుశా ఒంటపట్టించుకోలేదేమో? ప్రస్తుతం కష్టాలు ఒక వ్యక్తిని కొట్టి తెచ్చుకొన్నారు. బతుకు తెరువు కోసం దేశం కానీ దేశం వెళ్ళి. శాంతిగా జీవనం సాగించక ..అక్కడ ఓ పౌరుడితో గొడవ పెట్టుకొని ఆ వ్యక్తిని తీవ్రంగా గాయపర్చడంతో అధికారులు ఆ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఒక బహెరిన్ వ్యక్తిపై దాడి చేసి దోపిడీ చేసిన కేసులలో ఆ ముగ్గురు ఆసియా దేశస్థులకు అశాంతికాలం దాపురించింది. వీరిలో ఓ ఇద్దరు నిందితులను మంగళవారం నాడే పోలీసులు అరెస్టు చేశారు. మూడవ నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆ ముగ్గురు అదే రోజున మనామా లోని ఒక బహ్రేయినీ వ్యక్తిని తీవ్రంగా కొట్టడం జరిగింది. రాజధాని గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ కల్నల్ ఖలీద్ అల్ తవాది తెలిపిన సమాచారం మేరకు మంగళవారం రాత్రి దాడి జరిపిన అనుమానితులు ఆసియా దేశస్థులని ఒక ప్రకటనలో ధ్రువీకరించారు. నిందితులు మనామా లోని ఒక సాంప్రదాయ కాఫీ దుకాణం వద్ద ఒక 41 ఏళ్ల పౌరుడిపై దాడి చేశారని తెలిపారు. తీవ్రమైన గాయాలకు గురైన బాధితుడు ఆస్పత్రిలో చేరినట్లు ఆయన తెలిపారు. ఈ కేసు గురించి బాధితుడు మంగళవారం పోలీసులకు పిర్యాదు చేయగా పోలీసులు దీనిపై దర్యాప్తును ప్రారంభించారు. వెంటనే ఓ ఇద్దరు అనుమానితులను గుర్తించి అరెస్టు చేశారు. మూడవ నిందితుడిని పెట్టుకొనేందుకు పరిశోధనలు వేగవంతంగా కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి చట్టపరమైన దావా వేయడంతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పంపినట్లు ఓకే అధికారిక తెలిపారు. రాజధాని ప్రాసిక్యూషన్ ముఖ్యులు మహమ్మద్ అల్ మాలికీ మాట్లాడుతూ, ఒక బహ్రేయినీ పౌరుడు తీవ్రంగా పాత మనామా నగరంలో ఒక కాఫి దుకాణం వద్ద ఆసియా జాతీయుల బృందం ఒక బహ్రేయినీ వ్యక్తిని తీవ్రంగా గాయపర్చినట్లు కాపిటల్ పోలీస్ డైరెక్టరేట్ నుండి ఒక పబ్లిక్ ప్రాసిక్యూషన్ నివేదిక పొందినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.బహెరిన్ పౌరుడు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేరినట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న ఇద్దరుఅనుమానితులను మూడవ నిందితుడి కోసం ప్రశ్నిస్తూ తదుపరి దర్యాప్తు కోసం ఈ కేసుని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







