పాక్‌లో 'దంగల్'కు నో చెప్పిన బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్
- April 07, 2017
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన తాజా చిత్రం ‘దంగల్’ను పాకిస్థాన్‌లో విడుదల చేయడానికి ఒప్పుకోలేదు. 2016లో జమ్మూకశ్మీర్‌లోని ఉరీ దాడులు జరిగిన నేపథ్యంలో పాక్‌లో భారత సినిమాలను నిలిపివేశారు. ఆ తర్వాత గొడవలు సర్దుమణిగాక భారత సినిమాలపై నిషేధాన్ని పాక్ ఎత్తివేసింది. దంగల్ సినిమా విడుదలైనప్పుడు పాకిస్థాన్‌కి చెందిన లోకల్ డిస్ట్రిబ్యూటర్లు పాక్‌లోనూ సినిమా విడుదల చేయాలని కోరారు. ఇందుకు ఆమిర్ కూడా ఒప్పుకున్నారు. అయితే దంగల్ సినిమాలోని ఓ సన్నివేశంలో భారత జాతీయ జెండా, జాతీయ గీతం ఉండడంతో ఆ సన్నివేశాలని తొలగించాలని పాకిస్థాన్ సెన్సార్ బోర్డు ఆదేశించింది. ఇందుకు ఆమిర్ ఒప్పుకోలేదు.
ఈ క్రీడకు సంబంధించిన సినిమా అని.. ఇందులో భారత్-పాక్‌కు మధ్య ఎలాంటి సంబంధంలేదని అలాంటప్పుడు జాతీయ గీతం సన్నివేశాలను తొలగించాల్సిన అవసరమేంటని ఆమిర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో మొత్తానికి సినిమాని పాకిస్థాన్‌లో విడుదల చేయడానికి ఆమిర్, సినీ బృందం ఒప్పుకోలేదని బాలీవుడ్ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు









