పలుచోట్ల భారీ వర్షం హైదరాబాద్‌లో

- April 07, 2017 , by Maagulf
పలుచోట్ల భారీ వర్షం హైదరాబాద్‌లో

సమ్మర్‌లో హాయ్ హాయ్..వేసవిలో వర్షం హైదరాబాద్‌లో ఆహ్లాదాన్ని పంచింది. భానుడి భగభగల నుంచి భాగ్యనగర వాసులకు కాస్త ఊరట నిచ్చింది. ఉదయం నుంచి ఎండలు మండిపోగా...మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, మలక్ పేట్ , ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కొత్తపేట, సరూర్ నగర్, గన్ ఫౌండ్రిలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమలమయ్యాయి. 
మండుతున్న ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న గ్రేటర్ వాసులు ..ఒక్కసారీగా కురిసిన వర్షంతో సేద తీరారు. కూల్ వెదర్ ను ఎంజాయ్ చేశారు. చిరు జల్లుల్లో చినపిల్లలు సరదాగా ఆడుకున్నారు. ఆహ్లాదకరమైన వాతవరణాన్ని ఆస్వాదించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com