రాస్ అల్ ఖైమాహ్ విమానాశ్రయంలో115 మాదకద్రవ్య మాత్రలు మింగిన వ్యక్తి అరెస్టు

- April 10, 2017 , by Maagulf
రాస్ అల్ ఖైమాహ్ విమానాశ్రయంలో115 మాదకద్రవ్య మాత్రలు మింగిన వ్యక్తి అరెస్టు

దుబాయ్: ' ఎవరైనా కక్కుర్తిగా ఏదైనా అతిగా తింటుంటే, వామ్మో అది కడుపా చెరువా ? అంత ఎలా పొట్టలో పడుతుందో అని ఆశ్చర్యపోతుంటాం ' ..ఒక ఆసియా దేశానికి చెందిన వ్యక్తి తన కడుపు లోపల 115  మాదకద్రవ్య మాత్రలను రహస్యంగా దాచుకొని స్మగ్లింగ్ చేయబోయాడు. కానీ, రాస్ అల్ ఖైమాహ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఎం.జి. పేరుగల ఒక అనుమానితుడిని గుర్తించారు         ఆ తర్వాత ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. విమానాశ్రయం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద యొక్క ప్రవర్తన తీరు, నడవడిక చదివిన తనిఖీ అధికారులు అతడ్ని అదుపులోనికి తీసుకొని ప్రశ్నించినట్లు  రాస్ అల్ ఖైమాహ్ కస్టమ్స్ శాఖ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ అల్ మెహ్రాజి చెప్పారు. అనుమానితుడు విమానాశ్రయంలో అలసటగా కనిపిస్తూ, విపరీతంగా చెమటలు కక్కుతూ కాలు కాలిన పిల్లిలా గందరగోళంగా తిరుగుతూ తమ దృష్టిలో పడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో వారు ఆ వ్యక్తి కడుపును ఆధునాతన  స్క్రీనింగ్ పరికరాల సహాయంతో పరీక్షించగా పొట్టలో మాదక పదార్థాలను భారంగా మోస్తున్న చిహ్నం కనబడించిని తెలిపారు. ఆ తర్వాత అనుమానితుడిని పబ్లిక్ ప్రాసీక్యూషన్  సూచించినట్లు బ్రిగేడియర్ అల్ మెహ్రాజి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com