ప్రైవేట్ రంగం ఉద్యోగులు అందరకి ఆరోగ్య బీమా సౌకర్యం

- April 13, 2017 , by Maagulf
ప్రైవేట్ రంగం ఉద్యోగులు అందరకి ఆరోగ్య బీమా సౌకర్యం

జెడ్డా : ఏకీకృత ఆరోగ్య భీమా ఏప్రిల్ 10 వ తేదీ (సోమవారం) నుంచి అమలులోకి రానుంది. ఈ అమలు ఆఖరి దశ ప్రారంభిస్తు కో- ఆపరేటివ్ ఆరోగ్య భీమా యొక్క కౌన్సిల్  ప్రకటించింది.ఈ దశ లో  25 మంది లేదా అంత కంటే తక్కువగా ఉన్నఉద్యోగులకు ఈ బీమా వర్తిస్తుంది. దీని ప్రకారం  అన్ని కంపెనీలు, సంస్థలు వారి సౌదీ మరియు  సౌదీలు కానీ ఉద్యోగులు మరియు వారి ఆధారపడినవారికి  ఆరోగ్య బీమా ఉంటుందని కో- ఆపరేటివ్ ఆరోగ్య భీమా యొక్క కౌన్సిల్  సెక్రటరీ జనరల్ ముహమ్మద్ అల్ హుసైన్ స్పష్టం చేశారు. ఆరోగ్య భీమా పరిధిలోకి ఉద్యోగుల పిల్లలు రానున్నారు. అయితే, మగపిల్లలు  వయస్సు 25 సంవత్సరాల లోపున ఉండాలి. కుమార్తెలకు వారు వివాహం చేసుకొనేవరకు వరకు బీమా వర్తిస్తుంది ఇది ఏ యజమాని ఈ బీమా నుండి తన ఉద్యోగులు మినహాయించాలని చూడరాదని అలా చేస్తే ఇప్పుడు అది చట్టవిరుద్ధం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com