దుబాయ్ లో ఐదేళ్ళ బాలికను ముద్ధాడిన పాఠశాల బస్సు డ్రైవర్ కు జైలుశిక్ష
- April 13, 2017
దుబాయ్ : ' వినాశకాలే ....విపరీత బుద్ధి ' అన్నట్లుగా మారింది ఆ డ్రైవర్ పాడుబుద్ధి.. పిల్లలను ఇంటి నుండి బడికి ...బడి నుండి ఇంటికి తీసుకెళ్లాల్సిన ఓ బస్సు డ్రైవర్ కు మెదడులో పురుగు తొలిచి ముక్కుపచ్చలారని చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఆ చిన్నారిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని కౌగలించుకొంటూ ఆపై ముద్దాడుతూ పైత్య వికారాలను ప్రదర్శించాడు.ఈ నేరానికి నిందితునికి ఒక సంవత్సరం జైలుశిక్ష విధించారు. ఈ ఏడాది జనవరి 19 వ తేదీన జరిగిన ఈ ఘటనలో 26 ఏళ్ల పాకిస్తానీ వ్యక్తి బస్సులో ఎవరు లేని సమయంలో ఆ బాలిక పట్ల తన కామ వికారాలను ప్రదర్శించాడు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ రికార్డులు పరిశీలించిన తర్వాత ఆ నేరానికి గాను న్యాయస్థానం చేత ఆ శిక్ష విధించబడింది. శిక్షాకాలం ముగిసిన తర్వాత నిందితుడిని దేశం విడిచి పోవాలని తీర్పుని ఇచ్చింది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









