అమెరికా 'హాల్ ఆఫ్ ఫేమ్'లో ఆంధ్రుడు
- April 13, 2017
అమెరికా ఒహయో రాష్ట్రంలోని టోలెడో మెడికల్ అండ్ లైఫ్ సైన్సెస్ విశ్వవిద్యాలయం హాల్ ఆఫ్ ఫేమ్‌లో తెలుగు వైద్యుడు వాడరేవు రాజుకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజు 1965లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. ఆ తరువాత భారత్‌లోనే ఇంటర్న్‌షిప్, రెసిడెన్సీ పూర్తి చేసిన ఆయన ఇంగ్లండ్‌లోని సర్రేలోని ఓ ఆసుపత్రిలో అత్యవసర విభాగం అధికారిగా పనిచేశారు.
1984 నుంచి క్లినికల్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ ప్రైవేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఈఎఫ్‌ఏ)కు రాజు వ్యవస్థాపకుడు, మెడికల్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ వర్జీనియా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఇప్పటికే 14 దేశాల్లో తన సేవలను ప్రారంభించడంతో పాటు భారత్‌లో కంటి ఆసుపత్రులను స్థాపించింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







