ఎక్స్‌ఛేంజ్ హౌస్‌లో దోపిడీ: అనుమానితుడి అరెస్ట్
- April 14, 2017
ఎక్స్‌ఛేంజ్ హౌస్ దొంగతనం కేసులో అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిఫ్ఫాలో ఈ దొంగతనం జరిగింది. సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ కల్నల్ ముబారక్ అబ్దుల్లా అల్ మెర్రి ఈ విషయాన్ని ధృవీకరించారు. 28 ఏళ్ళ వయసు గల వ్యక్తిని అనుమానాస్పదంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నామని కల్నల్ చెప్పారు. ఈ అరెస్ట్ సందర్బంగా నగదుని సైతం స్వాధీనం చేసుకున్నారు. చట్టపరమైన చర్యల కోసం నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. ఈస్ట్ రిఫ్ఫా లోని బహ్రెయిన్ ఫైనాన్సింగ్ కంపెనీ దోపిడీకి గురయ్యింది. ఆయుధాలతో ఓ వ్యక్తి ఈ దోపిడీకి పాల్పడ్డాడు. దోపిడీ అనంతరం పోలీసులు విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







