పోలీసులపై దాడి కేసులో న్యాయస్థానం ముందుకి నిందితుడు
- April 14, 2017
39 ఏళ్ళ ఒమనీ వ్యక్తి, కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ముందు హాజరయ్యాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, వారిపై నిందితుడు దాడికి యత్నించాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులకు తేలికపాటి గాయాలయ్యాయి. పలు కేసులకు సంబంధించి నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, అతను తమపై దాడికి దిగినట్లు గాయాలపాలైన పోలీసులు న్యాయస్థానానికి వివరించారు. మెడ మీదా, తల మీదా, చేతుల మీదా నిందితుడి గోళ్ళ కారణంగా గాయాలు అయినట్లు వారు తెలిపారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కి తరలించి, అట్నుంచే ఆసుపత్రికి వెళ్ళి వైద్య చికిత్స పొందామని చెబుతూ, దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్‌ని కూడా కోర్టు ముందుంచారు పోలీసులు. ఇంకో వైపున నిందితుడు, తమను పోలీసులు కొట్టారంటూ విచారణలో పేర్కొన్నాడు. అయితే నిందితుడిపై ఎలాంటి గాయాలూ కనిపించలేదు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!







