3 ఇడియట్స్ సినిమా హాలీవుడ్ లో రీమేక్

- April 14, 2017 , by Maagulf
3 ఇడియట్స్ సినిమా హాలీవుడ్ లో రీమేక్

హాలీవుడ్ సినిమాలను ఇన్ స్పైర్ గా తీసుకొని మన సినిమాలు తెరకెక్కిస్తున్నారు అన్న సంగతి విధితమే.. అదీ సోషల్ మీడియా.. అందరికీ అందుబాటులోకి వచ్చాక మన సినిమాల్లో ఎక్కడైనా కాపీ సన్నివేశాలు కనిపిస్తే.. వెంటనే ఆ సినిమా ఎక్కడ ఏ భాష ఏ సన్నివేశామో తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. ఎప్పుడూ మన సినిమాలు విదేశీ సినిమాల స్పూర్తితో తెరకెక్కడమే కానీ.. మన సినిమాల స్పూర్తితో హాలీవుడ్ లో తెరకెక్కిన సినిమాలు తక్కువ.. మన సినిమాను హాలీవుడ్ లో రీమేక్ చేసే అరుదైన గౌరవం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 3 ఇడియట్స్ దక్కించుకొన్నది. 
2009 లో అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరణి తెరకెక్కించిన '3 ఇడియట్స్' అదే పేరుతో స్పానిష్ భాషలో రీమేక్ అయ్యింది. నిర్మాత విధు వినోద్ చోప్రా దగ్గర అధికారికంగా రీమేక్ హక్కులు తీసుకుని మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. ఈ చిత్ర ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. ఓ భారతీయ సినిమాను స్పెయిన్ వాళ్ళు రీమేక్ చెయ్యడం ట్రైలర్ లో '3 ఇడియట్స్' కళ్ల ముందు కనిపించడం ఖచ్చితంగా మనకు సరికొత్త ఫీలింగ్ ను ఇస్తుంది.. ఇది కచ్చితంగా భారతీయ సినిమాకు దక్కిన గౌరవం అని చెప్పాలి.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com