గతేడాది అదృశ్యమైన కేరళవాసి ఆఫ్గాన్‌లో మృతి
- April 14, 2017
కొంతకాలం క్రితం కేరళ నుంచి కన్పించకుండా పోయిన 21మందిలో ఓ యువకుడు ఆఫ్గాన్‌లో మృతిచెందాడు. పాడ్నా ప్రాంతానికి చెందిన ముర్షీద్ మహ్మద్ ఆఫ్గానిస్థాన్‌లో జరిగిన డ్రోన్ దాడిలో మరణించినట్లు భారత ముస్లిం లీగ్ యూనియన్ లీడర్ అబ్దుల్ రహిమాన్ మీడియాకు వెల్లడించారు. సోషల్‌మీడియా ఆఫ్ టెలిగ్రామ్ ద్వారా ఆఫ్గాన్ నుంచి తనకు నిన్న సమాచారం వచ్చిందని రహిమాన్ పేర్కొన్నారు. అయితే ముర్షీద్ ఎప్పుడు, ఎక్కడ చనిపోయాడన్నది మాత్రం తనకు సమాచారం రాలేదన్నారు.
గతేడాది కేరళ నుంచి 21 మంది యువకులు కన్పించకుండా పోయిన విషయం తెలిసిందే. వారంతా సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఆఫ్గాన్‌లోని ఇస్లామిక్ స్థావరాలపై అమెరికా నిన్న అతిపెద్ద బాంబు దాడి చేసింది. ఈ దాడిలో 36 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్లు ఆఫ్గాన్ వెల్లడించింది. దీంతో ముర్షీద్ చనిపోయింది ఈ దాడిలోనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై తమ వద్ద ఎలాంటి అధికారిక సమాచారం లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







