ఆసియా బిలియర్డ్స్‌ చాంప్‌ పంకజ్‌ ఆడ్వాణీ

- April 14, 2017 , by Maagulf
ఆసియా బిలియర్డ్స్‌ చాంప్‌ పంకజ్‌  ఆడ్వాణీ

ఆసియా బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌ను భారత ఏస్‌ క్యూయిస్ట్‌ పంకజ్‌ ఆడ్వాణీ కైవసం చేసుకున్నాడు. శుక్రవారం ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్లో ఆడ్వాణీ 6-3లో సౌరవ్‌ కొఠారీపై విజయం సాధించాడు. తొలి సెషన్‌లో అద్భుత ఆటను ప్రదర్శించిన కొఠారీ 3-1 ఫ్రేములతో ఆధిక్యం సంపాదించాడు. అయితే బ్రేక్‌ తర్వాత శక్తియుక్తులను కూడదీసుకున్న పంకజ్‌.. అనూహ్యంగా చెలరేగాడు. 3-1తో వెనుకబడిన దశనుంచి ఊహించని రీతిలో పుంజుకుని వరుస ఫ్రేముల్లో నెగ్గాడు. ఆడ్వాణీకి ఇది ఆరో చాంపియన్‌షిప్‌. గ్రూప్‌ స్టేజ్‌లో కొఠారీపై 4-0తో నెగ్గిన పంకజ్‌.. ఫైనల్లో మాత్రం గట్టిపోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com