మాదక ద్రవ్యాలతో ప్రయాణికుడిని అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు

- April 15, 2017 , by Maagulf
మాదక ద్రవ్యాలతో ప్రయాణికుడిని అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు

కువైట్:కువైట్  అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు  ఖాళీ సిగరెట్ పెట్టెలలో 14 ముక్కల గంజాయిని దాచి ప్రయాణిస్తున్న ఒక అరబ్ వ్యక్తిని స్థానిక కస్టమ్ అధికారులు అరెస్టు చేసారు. అనంతరం సంబంధిత అధికారులకు ఆ వ్యక్తిని అప్పగించారు. ఇంతలో, మరో సౌదీ జాతీయుడిని నువైసీబీ భూ సరిహద్దు వెలుపల అధికారులు అరెస్ట్ చేశారు. తన కారులో అక్రమ మాదకద్రవ్య మాత్రలను తరలిస్తుండగా పట్టుకొన్నారు. కారులో ఉన్న నిందితుడు అధికారులను చూడగానే కంగారు పడి వణకడం ప్రారంభించాడు. దాంతో అనుమానం వచ్చిన వారు ఆ నిందితుని కారు శోధించగానే మాదకద్రవ్య మాత్రలు బయటపడ్డాయి. అలాగే జహ్రా పురపాలక శాఖ ఇన్స్పెక్టర్లు బయటకుకొన్ని వాణిజ్య దుకాణాలలో  27  శోధనలు నిర్వహించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com