షార్జాలో అగ్ని ప్రమాదం: నీడ కోల్పోయిన 250 కుటుంబాలు
- October 01, 2015
షార్జాలో 32 అంతస్తులు కలిగిన ఓ భారీ భవంతిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో 250 కుటుంబాలు నీడ కోల్పోయాయి. ఇందులో 6 అంతస్తులు పార్కింగ్ కోసం కేటాయించగా, మిగతా 26 ఫ్లోర్లలోని ఫ్లాట్స్‌లో 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే అగ్నిప్రమాదం కారణంగా ఎవరూ తీవ్రంగా గాయపడటంగానీ, ప్రాణాలు కోల్పోవడంగానీ జరగలేదు. ఆరవ లెవల్ పార్కింగ్‌లో 14 కార్లు మాత్రం తీవ్రంగా ధ్వంసమయ్యాయి. 40 మంది నివాసితులకు చిన్నపాటి గాయాలయ్యాయి. వారందరికీ ప్రాథమిక చికిత్స అందించారు. గతంలో కాంటినెంటల్ పేరుతో ఉన్న ఈ భవంతి, ప్రస్తుతం అల్ నాజర్ టవర్ పేరుతో ఉంది. భవంతిలో సరైన రక్షణ చర్యలు లేవని, విద్యుత్ కేబుళ్ళు బయటకు వచ్చి ప్రమాదకరంగా కనిపిస్తున్నాయని ఫిర్యాదు చేసినా భవంతి యజమాని పట్టించులేదని ఫ్లాట్లలో నివసిస్తున్నవారు వాపోయారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







