గోంగూర ఫూల్‌మఖని ఫ్రైడ్‌ రెస్‌

- April 16, 2017 , by Maagulf
గోంగూర ఫూల్‌మఖని ఫ్రైడ్‌ రెస్‌

కావలసిన పదార్థాలు: ఫూల్‌మఖని - ఒక కప్పు, అన్నం - ఒక కప్పు, గోంగూర పేస్టు - అర కప్పు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిబఠాణీ - పావుకప్పు, క్యారెట్‌ ముక్కలు - పావు కప్పు, పచ్చిమిర్చి - మూడు, గరం మసాలా - ఒక టీస్పూను, కొత్తిమీర తురుము - ఒక టీస్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: కడాయిలో పూల్‌మఖనిని కాసేపు వేగించి పక్కన పెట్టుకోవాలి. మరో కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్‌ ముక్కలు, ఉడికించిన పచ్చి బఠాణీ వేసి కాసేపు వేగించాలి. తర్వాత గోంగూర పేస్టు, ఉప్పు, ఫూల్‌మఖని వేసి కలిపి తర్వాత అన్నం కూడా వేసి కలిపి కాసేపు ఉంచి కొత్తిమీర చల్లి దించుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com