తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం వడగాలుల హెచ్చరిక

- April 16, 2017 , by Maagulf
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం వడగాలుల హెచ్చరిక

తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 2 నుంచి 4 డిగ్రీలు అదనంగా పెరిగి అన్ని చోట్లా 42 డిగ్రీలను దాటే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం పలుప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశముందని కేంద్రం సంచాలకురాలు డాక్టర్‌ కె.నాగరత్న తెలిపారు. ఆదివారం పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో గాలిలో తేమ పూర్తిగా తగ్గి వేడి, ఉక్కపోతలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత పదేళ్లలో ఏప్రిల్‌ నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల స్థాయికి చేరువగా ఆదివారం నమోదవడం గమనార్హం. హైదరాబాద్‌లో అత్యధికంగా 2016 ఏప్రిల్‌ 14న 43 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదవగా దానికి చేరువగా ఆదివారం 42.4 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణంకన్నా 4 డిగ్రీలు అదనం. వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం సాధారణంకన్నా 4 డిగ్రీలు అదనంగా పెరిగితే వడగాలుల తీవ్రత ఎక్కువవుతుంది. ఆదివారం అత్యధికంగా ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లలో ఉష్ణోగత్ర 44.4 డిగ్రీలకు చేరింది. హైదరాబాద్‌లో గాలిలో తేమ సాధారణంగా 52 శాతముండాలి. కానీ అది 31 శాతానికి పడిపోవడంతో నగరవాసులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com