యువకులకు వల.. డబ్బు కోసం డిమాండ్ నటి ఫోటోతో ప్రొఫైల్ పిక్
- April 16, 2017
ఏదైనా మనం మంచి కోసం ఉపయోగిస్తే.. మంచి జరుగుతుంది.. అదే చెడుగా వాడితే.. దాని ప్రభావం మొత్తం వ్యవస్థపై కూడా పడుతుంది.. సోషల్ మీడియా వచ్చాక నేరాలు, మోసాలు పెరిగిపోయాయి.. ముఖ్యంగా ఫేస్ బుక్ లో ఫేక్ ప్రొఫైల్ పిక్ పెట్టి యువతీ యువకులు చేస్తోన్న మోసాలకు అంతేలేకుండా పోతుంది..
ఫేస్ బుక్ లో కేరళ సినీ నటి ఫొటో ని ప్రొఫైల్ పిక్ పెట్టిన యువతి యువకులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి చాటింగ్ చేస్తూ.. కొద్ది రోజుల అనంతరం మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుందాం అని చెబుతుంది.. ఆమెను స్వయంగా కలిసిన తర్వాత ఫేస్‌బుక్‌లో ఫొటో ఫేక్ అని గుర్తించి దూరమైన యువకులను బ్లాక్‌మెయిల్ చేస్తోంది.. ఈ యువతి మాయలో పలువురు యువకులు పడ్డారు.. తాజాగా ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలేనికి చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ లో అందమైన యువతి ఫొటో చూసి రిక్వె్‌స్టను ఓకే చేశాడు. అనంతరం ఇద్దరూ చాటింగ్ చెయ్యడం మొదలు పెట్టారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత యువతి "నిన్ను ప్రేమిస్తున్నా.. మనం ప్రేమించుకొందాం..! " అని అడిగింది.. అంతేకాదు తన తండ్రి డిఎప్సీ అని తనకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారని, వారిద్దరూ అమెరికాలోని ఇంజనీర్లుగా పనిచేస్తున్నారని ఫ్యామిలీకి గురించి వివరాలకు కూడా ఆ యువకుడికి చెప్పింది.. అమ్మాయి బాగుంది.. కుటుంబ నేపద్యం కూడా బాగుంది దీంతో ఆ యువకుడు పెళ్ళికి అంగీకరించాడు.. దీంతో ఇద్దరూ హైదరబాద్ లోని ఓ హోటల్ లో కలుసుకున్నారు.. కాగా ఆయువతిని చూసి ఫేస్ బుక్ లో యువతికి కి తనను కలిసిన యువతికి పోలికలు లేకపోవడంతో ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కంగుతిన్నాడు.. ఆమెను నిలదీశాడు. దీంతో తనను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని.. లేదంటే తనకు డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేయసాగింది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం ఆ యువకుడు తనను మోసం చేశాడంటూ ఆ యువతి ఈపూరుపాలెం పోలీసు స్టేషనలో అట్రాసిటీ కేసు పెట్టింది. దీంతో ఆ యువకుడు కూడా... ఆ యువతి తనను మోసం చేసి, బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బు డిమాండ్ చేస్తోందని, చంపిస్తానని బెదిస్తోందని ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రకాశం జిల్లాలోని వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన ఆమె తన తండ్రి డీఎస్పీ అని ఇచ్చిన ఫోన నంబర్ ఒంగోలులో పని చేస్తున్న ఓ డీఎస్పీదని తేలింది. డీఎస్పీకి ఆ యువతికి ఏ విధమైన రిలేషన్ లేదని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- భారతీయ ప్రయాణికులకు ఎమిరేట్స్ గుడ్ న్యూస్..
- భారత్ నుంచి బహ్రెయిన్‌కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్‌లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్‌కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం







