జులేఖా హాస్పిటల్‌ మరో బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌

- April 17, 2017 , by Maagulf

దుబాయ్‌: జులేఖా హాస్పిటల్‌, విజయవంతంగా మరో బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ని పూర్తి చేసింది. ఆదివారం నిర్వహఙంచిన ఈ బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌లో మొత్తం 40 మంది వలంటీర్లు, 18 లీటర్ల రక్తాన్ని మొబైల్‌ డొనేషన్‌ క్యాంప్‌ ద్వారా అందించారు. దుబాయ్‌ ప్రభుత్వం, దుబాయ్‌ హెల్త్‌ అథారిటీతో సంయుక్తంగా జులేఖా హాస్పిటల్‌ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఏప్రిల్‌ 16న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ క్యాంప్‌ని నిర్వహించారు. అత్యవసర సమయాల్లో రక్తం ఎంతో ముఖ్యమనీ, రక్తదానం చేయడం ద్వారా ప్రమాదాల్లో గాయపడినవారి ప్రాణాల్ని నిలబెట్టవచ్చునని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com