ఇస్రా వాల్ మిరాజ్ సందర్బంగా ఉచిత పార్కింగ్
- April 19, 2017
దుబాయ్ వాసులు, ఇస్రా వాల్ మిరాజ్ హాలీడే సందర్భంగా ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని పొందవచ్చునని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఆర్టిఎ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్ మోజా అల్ మర్రి మాట్లాడుతూ, ఇస్రా వాల్ మిరాజ్ హాలీడే సందర్భంగా అన్ని కస్టమర్స్ హ్యాపీనెస్ సెంటర్స్ మూసివేయబడ్తాయని చెప్పారు. ఏప్రిల్ 23, 2017న సెలవు దినం అనీ, సోమవారం తిరిగి కార్యకలాపాలు యధాతథంగా కొనసాగుతాయని చెప్పారు. మల్టీ లెవల్ పార్కింగ్ లాట్స్, ఫిష్ మార్కెట్ పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రం పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తారు. సెలవు సందర్భంగా మెట్రో రెడ్ లైన్ స్టేషన్స్ ఉదయం 5.30 నిమిషాల నుంచి రాత్రి 12.00 గంటల వరకు కొనసాగుతాయి. గ్రీన్ లైన్ స్టేషన్స్ ఉదయం 5.50 గంటల నుంచి రాత్రి 12.00 గంటల వరకు పనిచేస్తాయి. దుబాయ్ ట్రామ్ సర్వీసులు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 1.00 గంటవరకు పనిచేస్తాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







