నిజాయతీ అనే పదానికి బాపూజీ అర్ధం..!

- October 02, 2015 , by Maagulf
నిజాయతీ అనే పదానికి బాపూజీ అర్ధం..!

మహాత్మా గాంధీ 146వ జయంతి సందర్భంగా ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి తదితరులు నేతలిద్దరి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మనమంతా ఆలోచనలు, మాటలు, చేతల్లో నిజాయితీగా ఉండటాన్ని బాపూజీ నుంచి నేర్చుకుందామంటూ వైఎస్ జగన్ తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. అలాగే నిరాడంబర, ఆదర్శ జీవనం గడిపిన లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులు అర్పిద్దామన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com