పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా డౌన్ టు ఎర్త్ : రాశి

- April 19, 2017 , by Maagulf
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా డౌన్ టు ఎర్త్ : రాశి

సినియర్ హీరోయిన్ రాశి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'లంక'. శ్రీముని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మాట్లాడితో మాట్లాడిన రాశి.. పవన్ కళ్యాణ్ తో నటించి 'గోకులంలో సీత' రోజులను గుర్తు చేసుకున్నారు.
"పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత లో నటించా. అప్పుడు పెద్దగా మాట్లాడలేదు. అయితే రీసెంట్ గా మా పాప పుట్టినరోజు సందర్భంగా పవన్‌కల్యాణ్‌ తెలిసిన వ్యక్తి అని కలవడానికి వెళ్లా. అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారా అని అడిగారు. నేను వచ్చిన విషయం ఆయనకు తెలియదు. నేనేమో బయట వేచి ఉన్నా. తర్వాత ఆయనకు విషయం తెలిసి వెంటనే పిలిపించి నాతో చాలాసేపు మాట్లాడారు. 'గోకులంలో సీత' సినిమా సమయంలో కన్నా ఇలా ఆయన్ను కలిసినప్పుడే ఎక్కువ సేపు మాట్లాడా. ఆయన చాలా చాలా డౌన్ టు ఎర్త్" అని చెప్పుకొచ్చారు.
ఇక లంక చిత్రం గురించి చెబుతూ.. హీరోయిన్ గా చిత్రాలు చేశా. కానీ ఏ సినిమాలోనూ ఇంతటి క్లిష్టమైన పాత్రని పోషించలేదు. నాలోని నటికి సవాల్‌ విసిరిన పాత్రని ఇందులో చేశా'' అని అన్నారు. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com