సాహూగా మనముందుకు రాబోతున్న ప్రభాస్ కొత్త సినిమా
- April 20, 2017
తెలుగు ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ 'చత్రపతి' చిత్రం తర్వాత ఎక్కడ లేని మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక డార్లింగ్, మిర్చి లాంటి సినిమాల తర్వాత మనోడి స్టార్ ఇమేజ్ మారిపోయింది. ఇక రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రంతో ఏకంగా జాతీయ స్థాయిన నటుడుగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు భారత దేశం అంతటా 'బాహుబలి' మానియా పట్టుకుంది. అయితే బాహుబలి చిత్రం కోసం ప్రభాస్ ఎన్నో త్యాగాలు చేశారు. ముఖ్యంగా ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఏ చిత్రానికి కమిట్ కాకుండా దూరంగా ఉంటూ వచ్చారు.
దీంతో దాదాపు ఐదు సంవత్సరాలు ఫ్యాన్స్ కి బాహుబలి తప్ప ఏ సినిమాలో కనిపించకుండా పోయాడు ప్రభాస్. దీంతో బాహుబలి 2 రిలీజ్ తర్వాత ఏకంగా రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. అంతే కాదు యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో త్రిభాషా చిత్రం చేయనున్నాడు ప్రభాస్ . ఆ సినిమా ఎప్పుడో ప్రారంభమైన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కోసం ప్రత్యేకంగా షూటింగ్ చేసిన చిత్రయూనిట్ ఫస్ట్ లుక్‌ను బాహుబలి రిలీజ్ కన్నా ఐదు రోజుల ముందే విడుదల చేస్తున్నారు.
రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాహో అనే టైటిల్‌ను ఫైనల్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.అవును ఏప్రిల్ 23న ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో నటించనున్న ''సాహో '' ఫస్ట్ లుక్ ని టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారు .అంతేకాదు టీజర్ ని కూడా రిలీజ్ చేస్తున్నారు . బాహుబలి 2 తో పాటు అన్ని థియేటర్ లలో ఈ టీజర్ ని ప్రదర్శిస్తారు .
మొత్తానికి ప్రభాస్ కెరీర్ లో బాహుబలి తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ సినిమాను 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శంకర్ ఇషాన్ లాయ్‌లు సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ తారను హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







