శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో 2.30కిలోల బంగారం స్వాధీనం

- April 20, 2017 , by Maagulf
శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్  లో 2.30కిలోల బంగారం స్వాధీనం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. జడ్డా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విమానంలో రూ.75లక్షలు విలువ చేసే 2.35 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని ఇద్దరు మహిళలకు విడివిడి బాక్సుల్లో అప్పగించి శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ వ్యక్తికి ఇవ్వాంలంటూ స్మగ్లింగ్‌ ముఠా చెప్పినట్లు గుర్తించారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు బంగారం పట్టుకున్నప్పటికీ విషయం బయటకు పొక్కకుండా కస్టమ్స్‌ అధికారులు జాగ్రత్త పడ్డారు. ఆ మహిళలను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com