తొలిసారిగా హైదరాబాద్ మెట్రోలో షూటింగ్ జరుపుకుంటున్న తొలి చిత్రం అఖిల్‌దే

- April 21, 2017 , by Maagulf
తొలిసారిగా హైదరాబాద్ మెట్రోలో షూటింగ్ జరుపుకుంటున్న తొలి చిత్రం అఖిల్‌దే

'మనం' విజయంతో విక్రమ్ కుమార్‌పై భరోసా ఉంచి అఖిల్ సెకండ్ మూవీ బాధ్యతను అప్పగించాడు నాగార్జున. ఆరంభానికి ముందే ఓ అరుదైన రికార్డును ఈ సినిమా అందుకోవడం విశేషం. అఖిల్ హీరోగా రూపొందుతున్న సెకండ్ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తెలుగులో ఎవరూ ఇంతవరకూ టచ్ చేయని కొత్త జానర్‌లో ఈ సినిమా ఉండబోతోందంటున్నారు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్‌కు ఎంతో ఇంపార్టెన్స్ ఉందట. దీంతో మొదటగా ఈ యాక్షన్ సన్నివేశాలే చిత్రీకరిస్తున్నారు. ఇక రీసెంట్‌గా '24' సినిమాలో విక్రమ్ కుమార్ చిత్రీకరించిన ట్రైన్ ఫైట్స్ ఆ సినిమాకు హైలైట్‌గా నిలచాయి. దీంతో అఖిల్ మూవీలోనూ ఓ ట్రైన్ ఫైట్‌ను ప్లాన్ చేశాడు విక్రమ్ కుమార్. ఇప్పుడీ సీన్స్‌తో అఖిల్ మూవీ ఓ అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకోవడం విశేషం. అఖిల్ సెకండ్ మూవీకి సంబంధించిన ట్రైన్ సీన్స్‌ను హైదరాబాద్ మెట్రో రైల్‌లో చిత్రీకరించారు. ఈ రిస్కీ ఎపిసోడ్‌కి 'బాబ్ బ్రౌన్' యాక్షన్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ట్రయల్ రన్ మినహా ఇంకా ప్రారంభం కాని హైద్రాబాద్ మెట్రో రైల్‌లో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రంగా అఖిల్ సినిమా అరుదైన రికార్డును అందుకుంది.
షూటింగ్‌కి అనుమతి ఇచ్చిన మెట్రో మేనేజ్ మెంట్‌కి ధన్యవాదాలు తెలిపిన అఖిల్.. మెట్రో ట్రైన్‌లో నుంచి చూస్తుంటే, హైదరాబాద్ మరింత అందంగా కనిపిస్తోందని అన్నాడు. మరి.. ఆల్రెడీ అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి విజయాన్ని అందించిన విక్రమ్ కుమార్..
అఖిల్ మూవీతో మరో సక్సెస్‌ను అందిస్తాడేమో చూడాలి..!  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com