రయ్యాన్ మునిసిపాలిటీ 1000 తనిఖీలు
- April 21, 2017
అల్ రయ్యాన్ మునిసిపాలిటీ 1,083 తనిఖీల్ని మార్చి నెలలో నిర్వహించింది. వీటిల్లో రెండు ఆకస్మిక తనిఖీలు కూడా ఉన్నాయి. ఫుడ్ ఫెసిలిటీస్పైనా, ఇతర ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. తనిఖీల్లో 123 ఉల్లంఘనల్ని గుర్తించారు. ఉల్లంఘనలకు పాల్పడ్డవారి నుంచి 11 అఫిడవిట్లు కూడా తీసుకున్నారు అధికారులు. ఈ సందర్భంగా 39 ఫుడ్ శాంపిల్స్‌ని సెంట్రల్ లేబరేటరీకి పరీక్షల నిమిత్తం పంపడం జరిగింది. ఈ సందర్భంగా 201,000 ఖతారీ రియాల్స్ జరీమానాని కూడా వసూలు చేశారు. కొత్తగా 99 కమర్షియల్ లైసెన్సుల్ని ఈ ఇన్స్పెక్షన్స్ ద్వారా మంజూరు చేశారు. ఐదు తాత్కాలిక కొత్త లైసెన్సుల్నీ మంజూరు చేయడం జరిగింది. ఇంకో వైపున అల్ షీహానియా మునిసిపాలిటీ 906 తనిఖీలను మార్చిలో నిర్వహించారు. 25 ఉల్లంఘనల్ని ఈ సందర్భంగా గుర్తించారు. 19 అబాండన్డ్ వెహికిల్స్‌ని తొలగించడం జరిగింది.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









