నందమూరి కళ్యాణ రామ్ కొత్త సినిమా అక్టోబర్ 30 న రిలీజ్
- October 02, 2015
నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై మల్లికార్జున్ దర్శకత్వంలో కొమర వెంకటేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ షేర్. ఈ చిత్రం ఆడియోను అక్టోబర్ 10న విడుదల చేస్తున్నారు. అలాగే చిత్రాన్ని అక్టోబర్ 30న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చెయ్యడానికి నిర్మాత కొమర వెంకటేష్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా.. నిర్మాత కొమర వెంకటేష్ మాట్లాడుతూ.. మా సినిమాకి సంబంధించిన షూటింగ్ పార్ట్ టోటల్‌గా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 30న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రం ఆడియోను అక్టోబర్ 10న హైదరాబాద్‌లోని పార్క్ హయాత్ హోటల్లో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యబోతున్నాం. ఈ ఆడియో ఫంక్షన్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియోను ఆవిష్కరించబోతున్నారు. మా చిత్రానికి థమన్ చాలా ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ మల్లికార్జున్ టేకింగ్ చాలా అద్భుతంగా వుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ కొత్త డైమెన్షన్లో కనిపిస్తారు. పటాస్ తో సూపర్‌హిట్ సాధించిన కళ్యాణ్‌రామ్‌గారికి షేర్ మరో పెద్ద హిట్ సినిమా అవుతుంది.. అన్నారు. దర్శకుడు మల్లికార్జున్ మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం కళ్యాణ్‌రామ్‌గారి కెరీర్లో మరో సెన్సేషనల్ మూవీ అవుతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌గారి పెర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రార్డినరీగా వుంటుంది. థమన్ సూపర్‌హిట్ సాంగ్స్‌ని చేశారు. ఆడియో కూడా పెద్ద హిట్ అవుతుంది.. అన్నారు. నందమూరి కళ్యాణ్‌రామ్, సోనాల్‌చౌహాన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్, రోహిణి, షాయాజీ షిండే, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







