కేటీఆర్‌కు ఆహ్వానం ప్రపంచ ఆర్ధిక సదస్సుకు
- April 21, 2017తండ్రి రాష్ట్రముఖ్యమంత్రి అయినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు కేటీఆర్. తన మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ప్రజల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. అదే అతన్ని ప్రపంచ స్థాయిలో గుర్తించేలా చేసింది. రాష్ట్రంలో స్టార్టప్‌ల ఏర్పాటు, ఐటీ రంగంలో చేస్తున్న కృషి, మిషన్ భగీరథ, హైస్పీడ్ బ్రాండ్ బాండ్ ఇంటర్నెట్ సదుపాయానికి తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న పంథాపై ప్రసంగించాలని కోరుతూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం పంపింది. చైనాలోని డాలియన్‌లో జూన్ 27 నుంచి 29 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు దేశ విదేశాల ప్రతినిధులు హాజరవుతారు. కనుక తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల సేకరణకు ఈ సదస్సు బాగా ఉపయోగపడుతుంది. అలాగే కేటీఆర్‌కు ఢిల్లీలో జరిగే సీఐఐ సదస్సులో పాల్గొనాల్సిందిగా కూడా ఆహ్వానం అందింది. ఏప్రిల్ 28, 29 తేదీల్లో ప్రపంచీకరణ భవిష్యత్తు అనే అంశంపై ఈ సదస్సు జరగనుంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









