ఆఫ్గనిస్తాన్‌లో ఆర్మీ బేస్‌పై ఉగ్ర దాడి: 50 మంది మృతి
- April 21, 2017
ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మిలిటరీ యూనిఫాంలో వచ్చి ఆర్మీ బేస్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 50 మంది సైనికులు మృతిచెందారు.
ఆఫ్గనిస్తాన్ ఉత్తరప్రాంతంలోని మజర్-ఇ-షరీఫ్ నగరం సమీపంలో ఉన్న ఆర్మీబేస్‌పై శుక్రవారం ఉగ్రవాదులు దాడి చేశారు. సుమారు 10 మంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. వారిలో ఇద్దరు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఏడుగురు ఉగ్రవాదులను కౌంటర్ ఆపరేషన్‌లో సైనికులు కాల్చిచంపగా.. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ బేస్‌పై ఉగ్రవాదుల దాడిలో 50 మందికి పైగా ఆఫ్గన్ సైనికులు మృతి చెందారని యూఎస్ మిలిటరీ స్పోక్స్‌పర్సన్ మీడియాతో వెల్లడించారు. ఆర్మీబేస్ వద్దగల మసీదు, డైనింగ్ హాల్‌లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







