ముచ్చటగా మూడు ఆఫర్లు బీఎస్ఎన్ఎల్ లో

- April 22, 2017 , by Maagulf
ముచ్చటగా మూడు ఆఫర్లు బీఎస్ఎన్ఎల్ లో

టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియో దెబ్బ అంతాఇంతా లేదు. టెలికాం సంస్థలన్ని ఆఫర్ల బాటతో జియోకు కౌంటర్ ఇస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ముచ్చటగా మూడు ఆఫర్లు లాంచ్ చేసింది. దిల్ కోల్ కె బోల్(ఎస్టీవీ 349), ట్రిపుల్ ఏస్(ఎస్టీవీ 333), నెహెల్ పర్ దేహ్లా(ఎస్టీవీ 395) పేర్లతో ఈ ఆఫర్లను లాంచ్ చేసినట్టు బీఎస్ఎన్ ప్రకటించింది. తన ఎస్టీవీ 339 ప్లాన్ ఆఫర్ను పునరుద్ధరించినట్టు, దీని కింద రోజుకు 3జీబీ డేటా వరకు అందించనున్నట్టు తెలిపింది. అంతకముందు కేవలం 2జీబీ డేటాను మాత్రమే ఈ టెలికాం సంస్థ ఆఫర్ చేసేది. ఈ ప్లాన్లోనే వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయని, వీటి వాలిడిటీ 28 రోజులని తెలుస్తోంది. 
 దిల్ కోల్ కె బోల్ ప్లాన్ కింద అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ను, రోజుకు 2జీబీ డేటాను 349 రూపాయల రీఛార్జ్తో అందించనుందని తెలిపింది. అదేవిధంగా ట్రిపుల్ ఏస్ ప్లాన్ కింద 333 రూపాయల రీఛార్జ్తో 90 రోజుల పాటు రోజుకు 3జీబీ డేటా వాడుకునే సౌకర్యముంటుందని పేర్కొంది. అంటే 90 రోజుల పాటు 270జీబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు.  ఇక మరో ప్లాన్ నెహెల్ పర్ దెహ్లాపై రోజుకు 2జీబీ డేటా చొప్పున 3000 బీఎస్ఎన్ఎల్ టూ బీఎస్ఎన్ఎల్ ఉచిత నిమిషాలు, 1800 నిమిషాల ఇతర నెట్వర్క్ కాల్స్ను కంపెనీ ఆఫర్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ స్కీమ్ 71 రోజుల వరకు వాలిడిటీలో ఉంటుందని కంపెనీ పేర్కొంది.  జియోకు కౌంటర్గా బీఎస్ఎన్ఎల్ తన కొత్త ప్లాన్స్ ను మార్కెట్లో ప్రవేశపెడుతుందని తెలుస్తోంది. జియో దెబ్బకు మిగతా టెలికాం సంస్థలు కూడా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com