2,800 దిర్హామ్‌లకు మహిళ అమ్మకం

- April 22, 2017 , by Maagulf
2,800 దిర్హామ్‌లకు మహిళ అమ్మకం

బంగ్లాదేశీ కార్మికుడొకరు, ఓ మహిళా మెయిడ్‌ని ఆమెకు చెందిన స్పాన్సర్‌ నుంచి తప్పించేందుకోసం కుట్ర పన్నిన కేసులో అరెస్టయ్యాడు. అలాగే, ఆమెతో వ్యభిచార కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రయత్నించినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. స్పాన్సరర్‌ నుంచి తప్పించిన తర్వాత బాధితురాల్ని ఓ ఫ్లాట్‌లో బంధించారు. మంచి ఉద్యోగం చూపిస్తానని చెప్పి తనను మోసగించారనీ, అతని ఫ్లాట్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరు మహిళలు వ్యభిచారులుగా ఉండటాన్ని తాను గుర్తించానని బాధితురాలు పోలీసు విచారణలో పేర్కొన్నారు. 2,800 దిర్హామ్‌లకు ఓ మహిళను విక్రయించేందుకు నిందితుడు ప్రయత్నిస్తుండగా తమకు సమాచారం అందడంతో, అతన్ని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. చాకచక్యంగా ఈ కేసులో వ్యవహరించామనీ, రెడ్‌ హ్యాండెడ్‌గా నిందుతడ్ని పట్టుకునేందుకుగాను టీమ్‌ని పంపించి, రికార్డెడ్‌గా సమాచారం రాబట్టామని అధికారులు వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com