మమ్ముట్టి తనయుడు జెమిని గణేశన్ గా
- April 23, 2017
యువ దర్శకుడు నాగ అశ్విన్ "ఎవడే సుబ్రమణ్యం" సినిమాతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నాడు.. తాజాగా తన రెండో సినిమా గా అలనాటి అందాల నటి "సావిత్రిని జీవిత చరిత్రను 'మహానటి' గా " తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 10 నుంచి హైదరాబాద్ లో జరుపుకోనున్నది.. ఇప్పటికే సావిత్రిగా కీర్తి సురేష్ ను, మరో కీలక పాత్రలో సమంత ను ఎంపిక చేసిన సంగతి విధితమే.. కాగా సావిత్రి జీవితంలో ముఖ్యమైన వ్యక్తి.. సావిత్రి భర్త జెమినీ గణేశన్.. ఈ పాత్రలో ఎవరు నటిస్తారు అనే ఆసక్తి అందరిలోనూ ఉన్నది.. ఇప్పటికే ఇద్దరి .. ముగ్గురు హీరోల పేర్లు వినిపించినా.. చివరకు ఓ యంగ్ స్టార్ హీరో ఆ క్యారెక్టర్ లో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.. మలయాళ నటుడు ముమ్ముట్టి తనయుడిగా అడుగు పెట్టి.. తన నటనతో అందరినీ ఆకట్టుకొన్న దుల్కర్ సల్మాన్ ను జెమినీ గణేశన్ పాత్రకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.. దుల్కర్ ఇప్పటికే ఒకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారాడు.. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా ఎన్టీఆర్, ఎన్నార్ ల పాత్రలు ఎంపిక చేయాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







