ఓయూకు రాష్ట్రపతి.. హైదరాబాద్ లో ట్రాఫిక్‌ ఆంక్షలు

- April 25, 2017 , by Maagulf
ఓయూకు రాష్ట్రపతి.. హైదరాబాద్ లో ట్రాఫిక్‌ ఆంక్షలు

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు, ఇఫ్లూ స్నాతకోత్సవాల్లో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. పలుచోట్ల ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు. మరికొన్నిచోట్ల ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. బేగంపేట్‌ విమానాశ్రయం నుంచి ఓయూ మార్గంలో ఈ ఆంక్షలు కొనసాగించనున్నారు. బేగంపేట నుంచి ఓయూ మార్గంలో రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఓయూ శతాబ్ది వేడుకల అనంతరం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాజ్‌భవన్‌కు వెళ్లనుండటంతో ఓయూ నుంచి రాజ్‌భవన్‌ వైపు మార్గంలో మధ్యాహ్నం 1.15 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. అనంతరం రాజ్‌భవన్‌ నుంచి రాష్ట్రపతి గచ్చిబౌలికి వెళ్లనుండటంతో ఈ సందర్భంగా రాజ్‌భవన్‌ నుంచి గచ్చిబౌలి మార్గంలో రేపు సాయంత్రం 4గంటల నుంచి 4.45 వరకు పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలను కొనసాగించనున్నారు. ఇఫ్లూ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని దిల్లీకి వెళ్లనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com