బ్యాన్‌ చేసిన చేపల వేట, అమ్మకం: 10 మందికి జరీమానా

- April 26, 2017 , by Maagulf
బ్యాన్‌ చేసిన చేపల వేట, అమ్మకం: 10 మందికి జరీమానా

ఫిషర్‌మెన్‌, అలాగే ఫిష్‌ సెల్లర్స్‌ 10 మందికి జరీమానా విధించారు. నిషేధిత షెరి మరియు సఫి చేపల్ని వేటాడటం, అమ్మడం వంటి నేరాలకుగాను ఈ జరీమానాను విధించినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి మరియు ఏప్రిల్‌లో ప్రతి యేడాదీ ఈ చేపల వేటను నిషేధించారు. మినిస్ట్రీ ఆఫ్‌ క్లైమేట్‌ చేంజ్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఈ నిషేధాన్ని అమల్లో ఉంచింది. అయితే నిషేధాన్ని లెక్క చేయకుండా కొందరు ఈ చేపల్ని వేటాడుతుండడంతో అత్యాధునిక పడవల సహాయంతో వారిని పట్టుకుని, వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వేటాడినా కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయని వారు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com