అనాథల కోసం నహ్ర్‌ అల్‌ నిల్‌లో టౌన్‌ ప్రారంభం

- April 27, 2017 , by Maagulf
అనాథల కోసం నహ్ర్‌ అల్‌ నిల్‌లో టౌన్‌ ప్రారంభం

షేక్‌ థని బిన్‌ హమాద్‌ అల్‌ థని, షేకా ఐషా బింట్‌ హమాద్‌ అల్‌ అత్తియా టౌన్‌ని అనాధల కోసం దామర్‌ సిటీలో ప్రారంభించారు. సుడాన్‌లోని నహ్ర్‌ అల్‌ నిల్‌ స్టేట్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. అసిస్టెంట్‌ ఆఫ్‌ ది ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ది రిపబ్లిక్‌ జనరల్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ సదీక్‌ అల్‌ మహ్‌ది సహా పలువురు మినిస్టర్స్‌ అలాగే ఖతార్‌ ఛారిటీ డెలిగేషన్‌ ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ప్రముఖ ఫెస్టివల్స్‌ అలాగే ఆర్టిస్టిక్‌ అండ్‌ హెరిటేజ్‌ షోస్‌ ఈ ప్రారంభోత్సవంలో ప్రధాన ఆకర్సణలుగా నిలిచాయి. ఖతారీ - సుడానీ సంప్రదాయాల్ని మేళవించి అనేక కార్యక్రమాల్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com