ఒకే సినిమాలో 3 పాత్రల్లో నటించనున్న విశాల్
- April 27, 2017
సీవీ కుమార్‌కు చెందిన ‘తిరుకుమరన్ ఎంటర్‌టైన్‌మెంట్’, అభినేష్ ఇళంగోకు చెందిన ‘అభి అండ్ అభి’ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నాళై నమదే’. దర్శకుడు పొన్‌రామ్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన వెంకటేశన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో విశాల్ మూడు పాత్రల్లో నటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. విశాల్‌కు జంటగా ఇద్దరు నాయికలు నటించనున్నారని, హాస్యపాత్రలో నటుడు సతీష్ నటించనున్నారని పేర్కొంది. భారీస్థాయిలో నిర్మించనున్న ఈ చిత్రంలో పలువురు అగ్రనటులు నటించనున్నారని తెలిపింది. ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. విశాల్ ప్రస్తుతం ‘తుప్పరివాళన్’, ‘ఇరుంబుతిరై’, ‘విలన్’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. ‘కరుప్పు రాజా వెళ్లె రాజా’ చిత్రంలో నటించడానికి ఆయన ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







