'గల్ఫ్' సినిమాకు వినోదపు పన్ను రద్దుకు కృషి

- April 28, 2017 , by Maagulf
'గల్ఫ్' సినిమాకు వినోదపు పన్ను రద్దుకు కృషి

“గల్ఫ్” సినిమాకు వినోదపు పన్ను రద్దు చేసేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంను తన వంతు బాధ్యతగా కోరుతానని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి అన్నారు.

తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలనుంచి జీవనోపాధి కోసం వెళ్ళి, కుటుంబాలకు దూరం అవుతూ, వారు పడే ఇబ్బందులను వివరిస్తూ, గల్ఫ్ వలసలు ఆగిపోవాలన్న ఇతివృత్తంతో శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన *గల్ఫ్* సినిమా బృందం ఆధ్వర్యంలో శుక్రవారం గల్ఫ్ అమరుల దినం కార్యక్రమం జగిత్యాల లో జరిగింది.

ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో పాటుగా సినిమా దర్శకులు పి.సునీల్ రెడ్డి, అరుణ హాస్పిటల్ వైద్యులు, సామాజిక వేత్త ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి, సినిమా హీరో పవన్, హీరోయిన్ డింపుల్, కార్యక్రమం కన్వీనర్లు మంద భీంరెడ్డి, కడార్ల రంజిత్ కుమార్ పాల్గొని, గల్ఫ్ అమరులకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ…జీవనోపాధికోసం ఉన్న ఊరు..కన్న తల్లితండ్రులు, భార్యాపిల్లలను వదిలి నానా కష్టాలు పడుతున్న గల్ఫ్ వలస జీవుల జీవన స్థితి గతులకు అద్దంపడుతూ, వలసలు ఆపాలన్న ఉద్దేశ్యంతో తీసిన సినిమా గల్ప్ వెతలు కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినోదం పన్ను మినహాయించేలా కృషి చేస్తానన్నారు.గల్ఫ్ లో దుర్మరణం చెందిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గల్ప్ లో మృతి చెందినవారి కుటుంబాలకు ప్రభుత్వం కనీసం రూ.3 లక్షల మృత ధన సహాయం అందించి ఆదుకోవాలని డా.శ్రీనివాస్ రెడ్డి, భీంరెడ్డి , తదితరులు డిమాండ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com