'రారండోయ్. వేడుక చూద్దాం' మే 13న ' ప్రీ-రిలీజ్
- April 29, 2017
ప్రేమమ్ చిత్రం తో సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య..తాజాగా రెండు సినిమాలను పూర్తి చేస్తున్నాడు..వాటిలో సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వం లో 'రారండోయ్. వేడుక చూద్దాం' ఒకటి. నాగ చైతన్య , రకుల్ ప్రీతి సింగ్ జంటగా నటిస్తున్న ఈ మూవీ ని అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ ఫై నాగార్జున నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. అంతకు ముందు మే 13 న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక చేయాలనీ ఫిక్స్ అయ్యారు. ఈ మధ్య మెగా హీరోలంత ఆడియో రిలీజ్ వేడుకలు చేయకుండా ప్రీ రిలీజ్ వేడుక చేసి వరుస సక్సెస్ లు అందుకుంటున్న నేపథ్యం లో ఈ సెంటిమెంట్ ను ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.
''కుటుంబమంతా కలసి చూసే ఓ చక్కటి ప్రేమకథా చిత్రమిదని యూనిట్ చెపుతున్నారు. నాగార్జున కెరియర్లో 'నిన్నే పెళ్లాడతా' ఎలా ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయిందో చైతూకి ఈ చిత్రం అంతలా తీపి గుర్తుంగా ఉండిపోతుందని డైరెక్టర్ అంటున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన రావడం తో అంత హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. జగపతి బాబు ప్రత్యేక రోల్ లో కనిపిస్తుండగా ..సంపత్, కౌసల్య, ఇర్షాద్, చలపతిరావు, అన్నపూర్ణ, పోసాని, రఘుబాబు తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: ఎస్.వి.విశ్వేశ్వర్, కూర్పు: గౌతంరాజు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







