పవర్ కేబుల్స్ దొంగల ముఠా అరెస్ట్
- April 29, 2017
రస్ అల్ ఖైమా పోలీసులు, ఏడుగురు సభ్యుల ముఠాని అరెస్ట్ చేశారు. ఎమిరేట్తోపాటు పక్కనే ఉన్న ఇతర ఎమిరేట్స్ నుంచి పవర్ కేబుల్స్ దొంగిలిస్తున్న కేసులో వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. పట్టుబడ్డ దొంగల ముఠాలో అందరూ ఆసియా దేశాలకు చెందినవారేనని పోలీసులు వెల్లడించారు. రస్ అల్ ఖైమా పోలీస్, డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) బ్రిగేడియర్ అబ్దుల్లా మెనాఖాస్ మాట్లాడుతూ, శనివారం పవర్ కేబుల్స్ అలాగే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ దొంగతనానికి సంబంధించి తమకు పలు ఫిర్యాదులు అందినట్లు వివరించారు. సెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసి, విచారణ చేపట్టామనీ, దొరికిన ఆధారాలను విశ్లేషించి, నిందితుల్ని అరెస్ట్ చేశామని చెప్పారాయన. నిందితులపై పలు నేరాల కింద కేసులు ఉన్నట్లు విచారణలో గుర్తించారు. ఎమిరేట్ వ్యాప్తంగా జరిగిన 72 దొంగతనాల్లో ఈ ముఠా ప్రమేయం ఉంది.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్‌కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









