ఆగస్టు 11న హజ్ యాత్ర హైదరాబాద్ నుండి షురూ
- April 29, 2017
2017 హజ్ యాత్రికులు ఈ ఏడాది సౌదీ ఎయిర్‌లైన్స్ విమానాల ద్వారా ఆగస్టు 11 నుంచి హజ్ ఆరాధనలకు వెళుతున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి షుకూర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత రెండేళ్ల నుంచి ఎయిర్ ఇండియా విమానాల్లో యాత్రికులు వెళ్లేవారని.. ఈసారి మార్పు జరిగినట్లు చెప్పారు. కేంద్ర హజ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర యాత్రికుల విమానాలు ఆగస్టు 11–22 మధ్య బయలుదేరతాయని తెలిపారు.
యాత్రికులు ఇక్కడి నుంచి ఎహెరామ్ (హజ్ ఆరాధన దుస్తులు)ల్లో జిద్దా వెళ్లి అక్కడి నుంచి మక్కా నగరానికి వెళతా రన్నారు. ఈ ఏడాది నుంచి మక్కా, మదీన నగరాల్లో ఆరాధనల సందర్భంగా వసతుల ఖర్చులు పెరిగాయన్నారు. మీనా, ముస్దలీఫాలో మౌల్లిమ్ ద్వారా మూడుపూటల భోజన ఏర్పాటు ఉందన్నారు. ప్రతీ ఏడాది హజ్ కమిటీ తరుఫున ఫోన్ సిమ్ కార్డులు ఇచ్చే వారని, ఈ ఏడాది నుంచి యాత్రికులే సిమ్‌కార్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిద్దా ఎయిర్‌పోర్టులో సిమ్‌కార్డులను తీసుకునే సౌకర్యం ఉందన్నారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







