టెక్సాస్ జైల్లో ఇండో-అమెరికన్
- April 30, 2017
అమెరికాలో తను పని చేసే సంస్థ సొమ్మునే నొక్కేసినందుకు, ఓ బ్యాంకును మోసగించినందుకు 45 ఏళ్ళ కిరణ్ అంధవరపు అనే ఇండో-అమెరికన్‌కు జైలు శిక్ష పడింది. టెక్సాస్‌లోని డిస్ట్రిక్ట్ కోర్టు అతనికి 20 నెలల జైలుశిక్ష విధించింది. జైలు నుంచి విడుదలయ్యాక అతని ప్రవర్తనపై మూడేళ్ళు పర్యవేక్షణ ఉండాలని న్యాయమూర్తి కీత్ పి.ఎలిసన్ తీర్పునిచ్చారు.
టెక్సాస్‌లోని కోన్రో సిటీలో ఉంటున్న కిరణ్-అక్కడి వెదర్ ఫోర్డ్ అనుబంధ సంస్థ ఈ-ప్రొడక్షన్ సొల్యుషన్స్‌లో పని చేసేవాడని తెలిసింది. అయితే ఇదే సంస్థ పేరిట బ్యాంకు అకౌంట్లు తెరిచి తనను సంస్థ యజమానిగా నమోదు చేసుకున్నాడు. తన కంపెనీ అసలు యజమాని పేరిట ఉన్న చెక్కులను దొంగిలించి ఆ మొత్తాన్ని తన ఖాతాలో జమ చేసుకునే వాడు. ఇలా సుమారు 4.84 లక్షల డాలర్లు (3.11 కోట్లు) కాజేశాడని, గత ఫిబ్రవరి 9న తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్‌తో బస్‌పాస్‌లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్
- ఏపీ నూతన సీఎస్‌గా సాయిప్రసాద్
- ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!









