ఎం.ఎం.ఇ పనిచేసే స్థలాల్లో ప్రమాదాలు తగ్గించడానికి ఇంటిగ్రేటెడ్ గైడ్ ప్రారంభం
- April 30, 2017
కతర్:మునిసిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వశాఖ ఒక ఇంటిగ్రేటెడ్ గైడ్ బుక్ ను ప్రారంభించింది, పని చేసే స్థలాల్లోప్రమాదాలు తగ్గిస్తుంది.ఈ మార్గదర్శి యొక్క ప్రాథమిక లక్ష్యం దేశం అంతటా వివిధ మౌలిక సదుపాయాల పనులలో నిమగ్నమై ఉన్న కార్మికుల వద్ద ఆరోగ్యకరమైన, సురక్షిత వాతావరణాన్ని సృష్టించడం. కతర్ లో వేగవంతమైన పట్టణ అభివృద్ధికి అనుగుణంగా ఈ చొరవ ముందుకు వచ్చింది,నిర్మాణ ప్రాజెక్టుల దుష్ప్రభావాలను పరిమితం చేసేందుకు ప్రత్యేకమైన పరిస్థితులను కోరుతూ, జనాభా మరియు వ్యాపారాలపై ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉండటం మరియు ప్రజలకు ఆరోగ్యకరమైన సరైన వాతావరణాన్ని సృష్టించడం దీని ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. దేశంలో వర్తించే చట్టాలు మరియు విధానాలకు సంబంధించిన అన్ని సమాచారం గైడ్ బుక్లో చేర్చబడ్డాయి. పని ప్రదేశాలకు సమీపంలో పర్యావరణం, ప్రజల సంపద, చెట్లు, జంతువులను రక్షించడం ఒక కీలకాంశంగా ఉంది .అదనంగా, ఈ పుస్తకంలో పని స్థలాలగురించి, స్థల కంచెలు, స్థల సంజ్ఞలు మరియు కాలిబాట సంజ్ఞలు మరియు పని గంటలతో సహా ఈ గైడ్ లో చేర్చబడ్డాయి.వాస్తవానికి, మునిసిపాలిటీలు, మంత్రిత్వశాఖలోని వివిధ విభాగాలు ఈ రంగంలో చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నాయి, క్షేత్రస్థాయికి తగిన అన్ని పరిస్థితులు వర్తించబడతాయి మరియు కార్మికులు అందరు ఖచ్చితంగా వాటిని అనుసరిస్తారని ఆశిస్తున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- ఒమానీ–బహ్రెయిన్ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఆప్టామిల్, బెబెలాక్ ఇన్ఫాంట్ ఫార్ములా పై SFDA హెచ్చరిక..!!
- ముహారక్ సౌక్ భవిష్యత్ పై కౌన్సిల్ సమీక్ష..!!
- కువైట్ జాతీయ దినోత్సవం..అద్భుతమైన వైమానిక ప్రదర్శన..!!
- విజిట్ ఖతార్..అల్ రువైస్ మారిటైమ్ హెరిటేజ్ ఫెస్టివల్..!!
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు









