సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- February 28, 2026
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక అంతర్జాతీయ సైబర్ నేరగాడిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన ప్రసన్న కుమార్ అనే వ్యక్తి కంబోడియాలో ఉంటూ తన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.నిందితుడు విదేశాల నుంచి వస్తుండగా చెన్నై విమానాశ్రయంలో పోలీసులు అతడిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు.
ప్రసన్నకుమార్ ఒక మ్యాట్రిమోనియర్ వెబ్ సైట్‌లో యువతి పేరిట నకిలీ ప్రొఫైల్ సృష్టించి బాధితులను పరిచయం చేసుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్నాడు.అలాగే నకిలీ క్రిప్టో ట్రేడింగ్ ద్వారా పలువురిని పెట్టుబడులకు ప్రోత్సహిస్తూ మోసం చేశాడు. ఒక బాధితుడిని నిందితుడు రూ.11 లక్షల మేర మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
మోసం చేయడానికి వందలాది అక్రమ సిమ్ కార్డులను సేకరించి ఫేక్ ఖాతాలు తెరిచినట్లు పోలీసులు గుర్తించారు. అతడి వద్ద సుమారు 500 సిమ్ కార్డులు లభించాయి. అంతర్జాతీయ సైబర్ ముఠాతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్న పోలీసులు, విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







