ఒమన్‌ నుంచి దుబాయ్‌కి 1 మిలియన్‌ విజిటర్లు

- May 01, 2017 , by Maagulf
ఒమన్‌ నుంచి దుబాయ్‌కి 1 మిలియన్‌ విజిటర్లు

ఇన్‌బౌండ్‌ టూరిజంకి సంబంధించినంతవరకు ఒమన్‌ నాలుగో స్థానంలో నిలిచింది. దుబాయ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ కామర్స్‌ మార్కెటింగ్‌ (దుబాయ్‌ టూరిజం) ఇడుదల చేసిన గణాంకాల ప్రకారం 2016లో దుబాయ్‌లో పర్యటించినవారిలో ఒమన్‌కి 4వ స్థానం దక్కింది. 1 మిలియన్‌ విజిటర్స్‌ దుబాయ్‌ని సందర్శించిన వారిలో (ఒమన్‌ నుంచి) ఉన్నారు. ఇండియా నుంచి అత్యధికంగా 1.8 మిలియన్ల మంది దుబాయ్‌ సందర్శించగా, సౌదీ అరేబియా 1.6 మిలియన్లతో రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానం 1.2 మిలియన్‌ విజిటర్లతో యూకే నిలిచింది. జిసిసి దేశాల నుంచి 3.4 మిలియన్ల మంది దుబాయ్‌ని సందర్శించారు. ఇది 2015తో పోల్చితే 5 శాతం అదనం. సౌదీ అరేబియా, ఒమన్‌, కువైట్‌, ఖతార్‌ జిసిసి దేశాల నుంచి దుబాయ్‌కి అత్యధికంగా వెళ్ళినవారి లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com