ప్రమాదకరమైన వైరస్ సోకి ఐసీయూలో రామ్‌గోపాల్ వర్మ
- May 01, 2017
వివాదాస్పద ట్వీట్లతో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందట. ప్రస్తుతం వర్మను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారట వైద్యులు. అయితే వర్మకు సోకిన వ్యాధికి ఏ మందులు ఇవ్వాలో కూడా వైద్యులకు అంతుపట్టడం లేదట. ఇదేదో జోక్ అనుకుంటున్నారా? ఇది జోక్ కాదండి బాబూ.. ఈ విషయాన్ని స్వయంగా వర్మే వెల్లడించాడు. అదేంటీ.. ఎప్పుడూ హాట్‌హాట్ ట్వీట్లతో అలరించే వర్మకు ఏమైందనే కదా మీ సందేహం. వర్మకు ఓ ప్రమాదకరమైన వైరస్ సోకిందట. ఆ వైరస్ పేరు బాహుబలి-2 జలసైటిస్ అట. ఇదేంటంటారా..? దర్శకుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి-2 చూసి విపరీతంగా అసూయకు గురవడం వల్లే వర్మకు ఈ వైరస్ సోకిందట. అందుకే వెంటనే హాస్పిటల్‌కు పరిగెత్తాడట. అయితే ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్‌కు వెళ్లిన వర్మ అక్కడ పరిస్థితి చూసి షాకయ్యాడట. ఎందుకంటే.. అప్పటకే ఇండియన్ స్టార్ డైరెక్టర్లందరూ తనలాగే వైరస్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ఐసీయూలో చేరిపోయి చికిత్స పొందుతూ కనిపించారట.
తాజా వార్తలు
- రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీ పై డ్రోన్ల దాడి ప్రయత్నం విఫలం: సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ
- కువైట్‌లో అమెరికా సైనిక విమానాలు కుప్పకూలిన ఘటన–సిబ్బంది సురక్షితం
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత: తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- దుబాయ్ విమానాల నిలిపివేతను పొడిగించిన ఎమిరేట్స్
- జూన్‌లో భారత్‌లో పర్యటించనున్న అఫ్గానిస్థాన్..
- యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం–సేవలకు అంతరాయం
- గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు
- నకిలీ కాల్స్ పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక









