టమోటా చికెన్‌ మంచూరియా

- May 01, 2017 , by Maagulf
టమోటా చికెన్‌ మంచూరియా

కావలసిన పదార్థాలు: బోన్‌లెస్‌ చికెన్‌ - అరకేజీ, ఉల్లిపాయలు - 2, క్యాప్సికం - 1, టమోటా - 1, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి - 6 రేకలు, సోయా సాస్‌ - 1 టేబుల్‌ స్పూను, పచ్చిమిర్చి - 2, వెనిగర్‌ - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, పంచదార - 1 టీ స్పూను, అజీనమోటో - 1 టీ స్పూను, కార్న్‌ఫ్లోర్‌ - 1 టేబుల్‌ స్పూను.
జారు కోసం: మైదా - అరకప్పు, కార్న్‌ ఫ్లోర్‌ - 1 టేబుల్‌ స్పూను, మిరియాల పొడి - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, సోయా సాస్‌ - 1 టీ స్పూను. 
తయారుచేసే విధానం: చికెన్‌ అంగుళం ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో మైదా, కార్న్‌ఫ్లోర్‌, మిరియాల పొడి, సోయాసాస్‌, ఉప్పు వేసి తగినంత నీటితో జారుగా కలపాలి. చికెన్‌ ముక్కల్ని ఆ జారులో ముంచి నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. కడాయిలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి వెల్లుల్లి, అల్లం, ఉల్లి, పచ్చిమిర్చి ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. తర్వాత టమోటా తరుగు, ఉప్పు, పంచదార, అజీనమోటో, క్యాప్సికం ముక్కలు కలపాలి. రెండు నిమిషాల తర్వాత సోయా సాస్‌, వెనిగర్‌ కలిపి కప్పు నీరు పోసి ఉడికించాలి. క్యాప్సికం సగం ఉడికిన తర్వాత (నీటిలో కరిగించిన) కార్న్‌ ఫ్లోర్‌ వేసి చిక్కబడేవరకు ఉంచాలి. ఇప్పుడు వేగించిన చికెన్‌ వేసి గ్రేవీ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. 3 నిమిషాల తర్వాత సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకుని ఉల్లికాడలతో అలంకరించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com