పోలీసుల జోక్యంతో కార్మికులకు జీతాలు
- May 01, 2017
సుమారు 250 మంది కార్మికులు, అల్ కోజ్ ఏరియాలోని అల్ ఖైల్ గేట్ వద్ద సోమవారం దుబాయ్‌కి చెందిన కాంట్రాక్టింగ్ కంపెనీ ముందు సమావేశమయ్యారు. కొన్నాళ్ళుగా తమకు జీతాలు చెల్లించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చారు వీరంతా. దుబాయ్ పోలీసులు, అలాగే లేబర్ కమిటీ అథారిటీస్, అలాగే వర్కర్స్ రిప్రెజెంటేటివ్స్ హుటాహుటిన ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ కంపెనీ కొత్త ఓనర్, తమ సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రెండు మూడు రోజుల్లోనే మొత్తం జీతాల్ని చెల్లించేలా ఏర్పాట్లు చేస్తామని కొత్త ఓనర్ వారికి హామీ ఇచ్చారు. హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముర్ మాట్లాడుతూ, వర్కర్స్, తమ జీతాల కోసం ఆందోళన చేసినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







