ముంబై నుంచి అబుదాబికి ఎమాన్‌ అహ్మద్‌

- May 02, 2017 , by Maagulf
ముంబై నుంచి అబుదాబికి ఎమాన్‌ అహ్మద్‌

ప్రపంచంలోనే అత్యంత బరువు కలిగిన మహిళగా పేరు పొందిన ఈజిప్టు మహిళ ఇమాన్‌ అహ్మద్‌ను బుధవారం తెల్లవారుజాము 2గంటలకు ప్రత్యేక విమానంలో అబుదాబి తరలించనున్నారు. ఎమాన్‌కు సరిపోయే విధంగా ప్రత్యేకమైన సదుపాయాలతో ఏర్పాటు చేసిన కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌ ముంబయి విమానాశ్రయం నుంచి తరలిస్తున్నట్లు ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌(ఎంఐఏఎల్‌) అధికారులు వెల్లడించారు. బరువు తగ్గించుకునే బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకునేందుకు ఫిబ్రవరి 11న ఎమాన్‌ ముంబయిలోని సైఫీ ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు వైద్యులు సరైన చికిత్స అందించడం లేదని.. వైద్యం చేస్తున్నట్లు అబద్ధాలు చెప్తున్నట్లు ఎమాన్‌ సోదరి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందువల్లే ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు ముంబయి నుంచి అబుదాబికి తరలిస్తున్నట్లు ఆమె సోదరి తెలిపారు.
అబుదాబికి చెందిన బుర్జీల్‌ ఆసుపత్రిలో తొమ్మిది మంది వైద్యబృందం నేతృత్వంలో ఆమెకు చికిత్స అందించనున్నట్లు అక్కడి ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఎమాన్‌ చికిత్సకు సంబంధించిన దాదాపు పదివేల మెడికల్‌ రికార్డులను అబుదాబి వీపీఎస్‌ హెల్త్‌కేర్‌ సిబ్బందికి ప్రత్యేక విమానంలో పంపించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com