భారతీయ రైల్వే లో టూరిస్టులు 'మహారాజు'లా ఆ ట్రైన్ లో వెళ్ళొచ్చు...
- May 03, 2017
ఈ ఏడాది వర్షాకాలంలో రైలు ప్రయాణికులకు, ముఖ్యంగా టూరిస్టులకు భారతీయ రైల్వే ఓ తీపి కబురు అందిస్తోంది. లగ్జరీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో హాయిగా అన్ని సౌకర్యాలనూ అనుభవిస్తూ ప్రయాణించవచ్చు. మహారాజా ఎక్స్ ప్రెస్ రైల్లో సరదాగా ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేయవచ్చునని ఇండియన్ రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తో కలిసి సంయుక్తంగా ఈ సరికొత్త ప్రమోషనల్ టూరిస్ట్ ప్రాజెక్ట్ చేపట్టింది.
టికెట్ కోసం ఫస్ట్ బుకింగ్ చేసుకున్న వ్యక్తికి ఒక టికెట్ (సీటు) ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. సదర్న్ సో జర్న్, సదర్న్ జువెల్స్ పేరిట వ్యవహరిస్తున్న రెండు కొత్త రూట్లలో పశ్చిమ, దక్షిణ భారతావని లోని పలు ప్రాంతాలను విజిట్ చేయవచ్చు. సదర్న్ సో జర్న్ లో గోవా, హంపి, మైసూర్, ఎర్నాకులం, త్రివేండ్రం లను కవర్ చేస్తే.. సదర్న్ జువెల్స్ లో చెట్టి నాడ్, మహాబలిపురం, మైసూర్, హంపి, గోవా ఉన్నాయి. 8 రోజుల్లో ఈ నగరాలను సందర్శించవచ్చునని, ఈ ట్రావెల్స్ సందర్భంగా సైట్ సీయింగ్ విశేషాలను కూడా వివరించే గైడ్లు ఉంటారని రైల్వే శాఖవర్గాలు తెలిపాయి.
సదర్న్ సోజర్న్ సెప్టెంబర్ 9 న ముంబై నుంచి, సదర్న్ జువెల్స్ సెప్టెంబరు 16 న త్రివేండ్రం నుంచి ప్రారంభమవుతుందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రయాణాల్లో రెస్టారెంట్, బార్ వంటి సర్వీసులు కూడా ఉంటాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







