అగ్ని కీలల్ని అదుపు చేసిన ఫైర్‌ ఫైటర్స్‌

- May 04, 2017 , by Maagulf
అగ్ని కీలల్ని అదుపు చేసిన ఫైర్‌ ఫైటర్స్‌

కిచెన్‌ గ్యాస్‌ పేలుడు భారీ అగ్ని ప్రమాదానికి కారణమయ్యింది. మువాలెహ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌, సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మవాలేహ్‌ సౌక్‌ వెనుకాల ఉన్న ఓ వర్కర్స్‌ బిల్డింగ్‌లో ఈ ప్రమాదం జరిగింది. భవనం అంతటా అగ్ని కీలలు వ్యాపించాయి. అలాగే పలు వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com